తెలంగాణ వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నేడు కామారెడ్డి జిల్లా పొందుర్తిలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఓవైపు అకాల వర్షాలు పడి రైతులు పంట నష్టపోతే.. మరోవైపు ఆత్మీయ సమావేశాలు అంటూ బిఆర్ఎస్ నేతలు తాగుబోతు సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. ఎన్నికలలో రైతులకు రుణమాఫీ హామీలు ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20 వేలు, మామిడి రైతులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.