Coffee: చాలామంది రోజూ కాఫీ ని తాగుతూ ఉంటారు కాఫీ ని తాగడం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అందరికీ తెలుసు. కాఫీ ని తాగడం వలన రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ ఫుడ్ అయినా సరే లిమిట్ గా తీసుకోవాలి. లిమిట్ దాటి ఏ ఫుడ్ ని తీసుకున్నా కూడా దాని వలన సమస్యలు వస్తూ ఉంటాయి. ఈరోజుల్లో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు కిడ్నీలో రాళ్లు చేరడానికి కిడ్నీ ఫెయిల్యూర్ ఇలా వస్తూ ఉంటాయి.
కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం సరైన జీవనశైలిని ఫాలో అవ్వడం వంటివి చేయాలి. చాలామంది వాళ్ళ యొక్క రోజుని ఒక కప్పు కాఫీతో మొదలు పెడుతూ ఉంటారు కాఫీ ని తీసుకోవడం వలన కొన్ని రకాల సమస్యలు వస్తాయి. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తీసుకోవడం మంచిది కాదు. టీ లేదా కాఫీ ని ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి. కాఫీ ఎక్కువ తీసుకుంటే నిద్రలేని సమస్యలు కూడా వస్తాయి. రోజూ కాళీ కడుపుతో కాఫీ ని తీసుకోవడం వలన ఎముకల సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
కిడ్నీలో రాళ్లు ఏర్పడితే ఎటువంటి లక్షణాలు కలుగుతాయి..
యూరిన్ వెళ్లే సమయం లో నొప్పి కలగడం
ఎక్కువసార్లు టాయిలెట్ రావడం
కడుపు నొప్పి
ఆకలి లేకపోవడం
వికారం
జ్వరం
కాఫీ ఎక్కువ తీసుకోవడం వలన డిహైడ్రేషన్ సమస్య కూడా వస్తుంది కిడ్నీ స్టోన్స్ వలన కడుపులో నడుము కూడా ఎక్కువ నొప్పి కలుగుతుంది. అయితే వేసవి కాలంలో డిహైడ్రేషన్ సమస్య ఎక్కువ కలుగుతుంది తక్కువ నీళ్లు తాగితే కిడ్నీలు శుభ్రం అవ్వవు.
టీ లేదా కాఫీ ని ఎక్కువ తీసుకోవడం వలన నాకు కిడ్నీలో స్టోన్స్ ఏర్పడవచ్చు ఇలాంటి సమయంలో ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. అప్పుడు కిడ్నీలో రాళ్లు చేరవు. ఫాస్ట్ ఫుడ్ వలన కూడా ఎక్కువగా కిడ్నీలో రాళ్లు చేరే ప్రమాదం ఉంది. బాగా అతిగా కాఫీ టీ తీసుకుంటే కిడ్నీలో రాళ్లు చేరతాయి ఎక్కువ సాల్ట్ స్పైసెస్ వంటివి తీసుకుంటే కూడా కిడ్నీలో రాళ్లు చేరే ప్రమాదం ఉంది. టీ కాఫీలకి దూరంగా ఉండాలి లిమిట్ గా మాత్రమే తీసుకోవాలి.