ఏపీ టెన్త్ ఫలితాల్లో ఆరో తరగతి విద్యార్థిని సత్తా చాటింది. ఏకంగా 488 మార్కులు సాధించింది. ముప్పల హేమశ్రీ కాకినాడ జిల్లా గాంధీనగర్ మహాత్మా గాంధీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. ఆమె చదువులో అసమాన ప్రతిభ కనబరుస్తుండగా… విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ స్వయంగా హేమశ్రీ తెలివితేటలు పరీక్షించి టెన్త్ పరీక్షలు రాయడానికి అనుమతిచ్చారు.
నిన్న ఫలితాల్లో 428 మార్కులు తెచ్చుకోని ఔరా అనిపించింది. కాగా, ఏపీ విద్యార్థులకు అలర్ట్. పదవ తరగతి పరీక్షల్లో ఐదు సబ్జెక్టుల్లో పాసైన విద్యార్థులకు పాస్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని, దాన్ని నమ్మవద్దని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. కేవలం ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు మూడు లాంగ్వేజ్ సబ్జెక్టుల్లో ఒక పేపర్ మినహాయింపు ఉందని, దీనిపై గతంలోనే జీవో జారీ చేశామని చెప్పారు.