వాతావరణం అనుకూలిస్తే సీఎం పర్యటన అవంతరాలు లేకుండా నిర్వహిస్తాం : కొడాలి నాని

-

ఈనెల 19వ తేదీ గుడివాడ టిడ్కో ఫ్లాట్లను ప్రారంభించి, లబ్ధిదారులకు అప్పగించనున్నారు ముఖ్యమంత్రి జగన్. అయితే.. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలసీల రఘురాం పరిశీలించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి పేర్ని నాని, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ జాషువా, ఎమ్మెల్సీ రఘురాం, అధికార బృందానికి లేఅవుట్ మొత్తం తిప్పి చూపించారు మాజీమంత్రి కొడాలి నాని. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. ఈనెల 19న గుడివాడ, 22న మచిలీపట్నంలో సీఎం జగన్ పర్యటన ఉందని, వాతావరణం అనుకూలిస్తే సీఎం పర్యటన అవంతరాలు లేకుండా నిర్వహిస్తామన్నారు.

Kodali Nani Condemns Chandrababu's Derogatory Comments On Welfare Scheme  Beneficiaries

టిడిపి హయంలో నామమాత్రంగా 12వందల ఫ్లాట్ల నిర్మాణం…వైసిపి పాలనలో 9వేల ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. 9వందల కోట్లతో పూర్తిస్థాయి మౌలిక వసతులతో టిడ్కో లేఅవుట్ అభివృద్ధి చేశామని ఆయన వెల్లడించారు. లబ్ధిదారుల తరఫున సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు కొడాల నాని. సీఎం జగన్ పర్యటనలో గుడివాడ ప్రజానీకం పాల్గొనాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news