అసలైన పాన్‌ఇండియా మూవీ ‘ది కేరళ స్టోరీ’ : వర్మ

-

అనేక వివాదాల నడుమ విడుదలైన ది కేరళ స్టోరీ సినిమాపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఈ సినిమాలో తమిళం, మలయాళం గర్ల్స్ ప్రధాన పాత్ర పోషిస్తే… గుజరాత్ కు చెందిన వ్యక్తి నిర్మించారని, హిందీ సినిమాగా బెంగాలీ వ్యక్తి డైరెక్ట్ చేశారని ట్విట్ చేశారు. ఇన్ని కలయికలు ఉన్న ఈ సినిమాకు అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ టాక్ వస్తుందని చెప్పారు.

దీంతో నిజమైన పాన్ ఇండియా మూవీగా మారుతోందని పేర్కొన్నారు. అయితే‘ది కేరళ స్టోరీ’ సినిమాపై పాజిటివ్ ప్రచారం చేసినందుకు ఓ వ్యక్తిని బెదిరించడంతోపాటు కొట్టారు. రాజస్థాన్ లో జరిగిన ఈ సంఘటనలో ముగ్గురిపై కేసు నమోదు అయింది. బాధితుడు VHPకి చెందిన కార్యకర్త కాగా, సినిమాను చూడమని ఓ యువతకి మెసేజ్ పంపడంతో పాటు వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. అయితే బాధితుడు బయటకు వెళ్లి తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డగించారు. అనంతరం బెదిరించి కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news