చాలామంది సెక్స్ కి బానిసలు అవుతూ ఉంటారు. ఒకసారి దేనికైనా ఎడిక్ట్ అయితే దాని నుండి బయటకు రావడం చాలా కష్టం. శృంగారం విషయంలో కూడా ఇదే జరుగుతుంది. శృంగారానికి బానిసలు అయిన వాళ్ళు దాని నుండి బయటపడలేరు. పని చేస్తున్నప్పుడు.. ఏదైనా పనిలో ఉన్నప్పుడు.. నిద్రపోయేటప్పుడు.. మేల్కొనేటప్పుడు.. ఇలా ఏ పని చేసినా కూడా అదే ఆలోచన ఉంటుంది అయితే శృంగారానికి బానిసలు అయ్యారని ఎలా చెప్పొచ్చు.. ఎటువంటి లక్షణాలు కనబడతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మనిషికి అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి కానీ అవి ఎక్కువగా ఉన్నప్పుడే నెగిటివ్ ఎఫెక్ట్ బాగా పడుతుంది. సెక్స్ విషయంలో కూడా ఇదే. శృంగారానికి సంబంధించిన వ్యసనం నిర్ధారించడానికి మెడికల్ టెస్ట్స్ వంటివి ఏమీ లేవు కొన్ని లక్షణాలు ద్వారా మనం గుర్తించొచ్చు. రక్షణ లేకుండా శృంగారంలో పాల్గొనాలని అనుకునే వాళ్ళు శృంగారానికి బానిస అయ్యారు అని చెప్పొచ్చు. పైగా భద్రతా చర్యల గురించి పట్టించుకోరు. అప్పటి ఆనందాన్ని మాత్రమే వాళ్ళు కోరుకుంటారు.
పక్క వాళ్ళని అదోరకంగా చూడడం, ఎక్కువగా హస్తప్రయోగం చేయడం, కోరికల కోసం ఏదైనా చేయాలని అనుకోవడం, పార్ట్నర్ ని విపరీతంగా మోసం చేయడం, లైంగిక నేరాలకి కూడా వెనకాడకపోవడం వంటివి ఉంటే కూడా శృంగారానికి ఆ వ్యక్తి బానిస అయ్యాడు అని చెప్పొచ్చు. లైంగిక వ్యసనానికి గురైన వ్యక్తుల్లో శారీరక లక్షణాలు మానసిక లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అక్రమ లైంగిక కోరికలు, డిప్రెషన్, లైంగిక ఆలోచనలు బాగా ముఖ్యమైనది సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి సమస్యని పరిష్కరించుకోవచ్చు ఇలాంటి లక్షణాలు ఉంటే గుర్తించి సమస్యని పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడాలి. ఆలోచనలను కోరికల్ని అదుపులో ఉంచుకోవాలి.