తలసానికి రేవంత్ లాగా నేరచరిత్ర లేదు – రాజ్యసభ ఎంపీ లింగయ్య

-

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. చిన్నప్పటినుండి దున్నపోతులను కాశాడు కాబట్టి ఆయనకు పేడ పిసకడం అలవాటేనని, అందుకే తనని పితుకుతానంటున్నాడని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. పాన్ పరాగ్ లు నమిలే వ్యక్తి తనపై మాట్లాడడం సరికాదని అన్నారు. అయితే తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్.

తలసానిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే గొల్ల కురుమలు సరియైన సమయంలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తలసాని తన మాటలను విత్ డ్రా చేసుకున్నారని.. అయినా రేవంత్ రెడ్డి గొల్ల కురుమల జాతిని అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. తలసానికి రేవంత్ రెడ్డి లాగా నేరచరిత్ర లేదని.. రేవంత్ రెడ్డి నోరు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news