ఏపీలో బలంగా ఉన్న వైసీపీ, టీడీపీల్లోనే కాదు..జనసేనలో కూడా కోవర్టులు ఉన్నారు. పార్టీలో ఉంటూ..పార్టీకే నష్టం చేసే వారు ఉన్నారు. తాజాగా పవన్ కల్యాణ్ సొంత పార్టీ నేతలకే ఇచ్చిన వార్నింగ్ బట్టి చూస్తే..జనసేనలో కూడా కోవర్టులు ఉన్నారని అర్ధమవుతుంది. అయితే సినిమా షూటింగ్ ల్లో ఎక్కువ బిజీగా ఉండటం వల్ల..జనసేనలో క్షేత్ర స్థాయిలో నాదెండ్ల మనోహర్ మాత్రమే తిరుగుతున్నారు. ప్రతి జిల్లాలో ఈయనే పర్యటించి..పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
అయితే పవన్ తర్వాత పార్టీలో నెంబర్ 2గా మనోహర్‌ని కొందరు జనసేన నేతలు లెక్క చేయడం లేదని తెలిసింది. అది కూడా పవన్ సొంత వర్గం కాపు నేతలు..మనోహర్ ని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. పైగా ఆయనపై విమర్శలకు కూడా దిగుతున్నారట. దీంతో తాజాగా జనసేన పార్టీ సమావేశంలో పవన్..సొంత నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఆయన వేరే కులం నేత అని, ఆయన్ని టార్గెట్ చేస్తున్నారా? అంటే పార్టీలో ఒకే కులం ఉండాలా? అలాంటి తన దగ్గర సాగవు అని కాపు నేతలకు పవన్ వార్నింగ్ ఇచ్చారు.
మరొకసారి మనోహర్‌ని గాని పార్టీలో ఉండే మహిళా నేతలని గాని, వేరే నేతలని గాని టార్గెట్ చేస్తే..క్రమశిక్షణ చర్యలు ఉంటాయని..వారిని వైసీపీ కోవర్టులుగా భావించి పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేస్తానని పవన్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో జనసేనలో కోవర్టులు ఎవరు అంటూ అంతా ఆరా తీస్తున్నారు. జనసేనలో ఉంటూ..టిడిపితో పోత్తు ఉంటే పవన్ సిఎం సీటు కూడా డిమాండ్ చేసేది వారే అని, అలాంటి వారి వల్ల జనసేన శ్రేణులు ఆశలు పెట్టుకుంటున్నాయి. దాని వల్ల భవిష్యత్ లో ఇబ్బంది అని తెలుస్తుంది.
అందుకే పార్టీ లైన్ ని దాటి వెళ్ళేవారిని సస్పెండ్ చేస్తానని పవన్ వార్నింగ్ ఇచ్చారు. మరి పవన్ వార్నింగ్ తో ఆ నేతలు బయటకొచ్చి సరికొత్త రాజకీయం ఏమైనా చేస్తారేమో చూడాలి.