కేంద్రం ఎన్నో రకాల పథకాల్ని తీసుకు వచ్చింది. రైతుల కోసం కూడా కేంద్రం ఎన్నో రకాల స్కీములని తీసుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ని రైతుల కోసం తీసుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా చాలా మంది రైతులు బెనిఫిట్ ని పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి తో ఏటా రూ.6,000 పెట్టుబడి సాయం అందుతుంది.
ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రూ.2,000 చొప్పున రైతుల బ్యాంక్ అకౌంట్లలో వేస్తుంది కేంద్రం. ఏప్రిల్-జూలై, ఆగస్ట్-నవంబర్, డిసెంబర్-మార్చ్ విడతలకు సంబంధించిన డబ్బులు రైతుల అకౌంట్ లో పడతాయి. 13 ఇన్స్టాల్మెంట్స్ని విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో రైతుల ఖాతాలో పీఎం కిసాన్ 14వ విడత పడతాయి. అయితే జూలైలోగా ఎప్పుడైనా పీఎం కిసాన్ డబ్బులు విడుదల కావొచ్చు. మే చివరిలోగానే పీఎం కిసాన్ 14వ ఇన్స్టాల్మెంట్ పడచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ స్కీము డబ్బులు పొందాలనుకుంటే అర్హులైన రైతులు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి. ఇక అది ఎలానో చూసేద్దాం.
మొదట https://www.pmkisan.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Farmers Corner సెక్షన్లో New Farmer Registration మీద క్లిక్ చేయాలి.
గ్రామీణ రైతు అయితే Rural Farmer Registration, పట్టణ రైతు అయితే Urban Farmer Registration ని ఎంపిక చేసేయండి.
ఆధార్ నెంబర్ , మొబైల్ నెంబర్ ఇచ్చేసి రాష్ట్రం పేరు కూడా సెలెక్ట్ చేయాలి.
క్యాప్చా ఎంటర్ చేసి Get OTP మీద నొక్కండి. నెంబర్కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి.
తర్వాత రైతుల పూర్తి వివరాలు, భూమికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేయాలి.
ప్రతీ నాలుగు నెలలకు ఓసారి రూ.2,000 చొప్పున జమ అవుతాయి.