కొత్త‌గూడెం జిల్లాలో మ‌రో మూడు డ‌యాలసిస్ సెంట‌ర్లు

-

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగూడెం జిల్లా వారికి, ముక్యంగా కిడ్నీ పేషెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌స్తుతం ఉన్న డ‌యాల‌సిస్ కేంద్రాల‌కు కిడ్నీ రోగులు పోటెత్త‌డం, అధిక స‌మ‌యం వేచి ఉండాల్సి ఉండ‌టంతో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం కొత్త‌గూడెం జిల్లాలో మ‌రో మూడు డ‌యాల‌సిస్ సెంట‌ర్లను కిడ్నీ రోగుల సౌక‌ర్యార్థం కొరకు ప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది. మ‌ణుగూరులోని గ‌వ‌ర్న‌మెంట్ ఏరియా హాస్పిట‌ల్‌, ఇల్లందులోని క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌లో బుధ‌వారం నాడు డ‌యాల‌సిస్ సెంట‌ర్ల‌ను ప్రారంభించ‌నున్నట్లు సమాచారం.

Telangana: Two new dialysis centres in Kothagudem from Wednesday -  Telangana Today

అశ్వ‌రావుపేట‌లో మూడో డ‌యాల‌సిస్ సెంట‌ర్‌ను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు ప్రారంభించ‌నున్నారు.
ప్ర‌స్తుతం కొత్త‌గూడెం గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌లో ఐదు మెషీన్ల‌తో, భ‌ద్రాచ‌లం గ‌వ‌ర్న‌మెంట్ ఏరియా హాస్పిట‌ల్‌లో 10 మెషీన్ల‌తో డ‌యాల‌సిస్ సెంట‌ర్ల‌ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సెంట‌ర్లు కిడ్నీ రోగుల‌కు సరిపోకపోవడం తో, కిడ్నీ రోగుల తాకిడి ఎక్కువైనందున మ‌ణుగూరు, ఇల్లందు, అశ్వ‌రావుపేట‌లో కొత్త‌గా డ‌యాల‌సిస్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం వెల్లడించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news