కొత్త సచివాలయంలో రేపు మంత్రివర్గ సమావేశం

-

నూతన సచివాలయంలో తొలిసారి మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ నెల 18న సీఎం కేసీఆర్​ అధ్యక్షతన.. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయంలో తొలిసారి మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేయడంతో.. అది కూడా రెండు సంవత్సరాలు తర్వాతనే జరగనుండడం చర్చనీయాంశమవుతోంది.

ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమావేశం చర్చించనున్నారు. జూన్ రెండో తేదీ నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. అందుకు సంబంధించి కేబినెట్​లో చర్చించి మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు. సచివాలయం ఎదుట సిద్ధమైన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభ తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది.

ఈ భేటీలో పోడు పట్టాల పంపిణీ తేదీలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను ప్రకటించి అమలు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ విషయమై కూడా కేబినెట్​లో చర్చ జరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news