ఈ రోజు ధర్మశాల వేదికగా పంజాబ్ మరియు ఢిల్లీ జట్ల మధ్యన మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో పంజాబ్ కు ఇది వ మ్యాచ్ కావడం విశేషం. ఇప్పటి వరకు పంజాబ్ 12 మ్యాచ్ లు ఆడగా కేవలం మ్యాచ్ లు మాత్రమే గెలిచి 12 పాయింట్ లతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది, మరో ఆరు మ్యాచ్ లలో ఓటమి చెందింది. దీనితో పంజాబ్ ప్లే ఆఫ్ కు చేరుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచ్ లలో గెలవడంతో పాటుగా రన్ రేట్ ను సైతం మెరుగుపరుచుకోవలసి ఉంది. అందులో భాగంగా ఈ రోజు ఢిల్లీ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఇందులో మొదటగా పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సో.. ఈ మ్యాచ్ లో గెలుపు దక్కించుకోవాలంటే ఖచ్చితంగా ఢిల్లీ ని తక్కువ స్కోర్ కు కట్టడి చేయాలి.
ఛేజింగ్ లో ముఖ్యంగా పంజాబ్ ఆటగాళ్లు ఆవేశపడకుండా నెమ్మదిగా వికెట్లు పడకుండా ఆడితే విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు. మరి పంజాబ్ ఢిల్లీ ని ఎన్ని పరుగులకు కట్టడి చేయనుంది అన్నది చూద్దాం.