అదిగో జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు..ఇంకా అమరావతి ప్రాంత పరిధిలో వైసీపీకి పెద్ద డ్యామేజ్ జరగనుంది..అమరావతి ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీకి భారీ నష్టం ఉంటుంది. అక్కడ వైసీపీ ఒక్క సీటు కూడా గెలవదు అని టిడిపి శ్రేణులు లెక్కలు వేసుకున్నాయి..పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. కానీ టిడిపి అంచనాలని తారుమారు చేస్తూ..గుంటూరులో వైసీపీకి ఆధిక్యం కొనసాగుతుందని తెలుస్తుంది.
మొదట అమరావతి పరిధిలో ఉన్న రెండు నియోజకవర్గాల్లో తప్ప..మిగిలిన స్థానాల్లో రాజధాని ప్రభావం పెద్దగా లేదు. దీంతో గుంటూరులో వైసీపీకి వచ్చే ఇబ్బందేమీ లేదు. ఇక ఇప్పుడు అమరావతిలో కూడా వైసీపీ బలం పెరిగేలా అక్కడ 50 వేల మంది పేదవాళ్ళకు జగన్ ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. దీని ద్వారా ఆ పరిధిలో ఉండే తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో వైసీపీకి ప్లస్ అవుతుంది. ఇక గుంటూరు జిల్లాలో కూడా వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదు.
గత ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 సీట్లు ఉంటే..వైసీపీకి 15 సీట్లు వచ్చాయి..టిడిపికి 2 సీట్లు మాత్రమే వచ్చాయి. మళ్ళీ అందులో ఒక ఎమ్మెల్యే వైసీపీ వైపుకు వచ్చారు. ఇలా జిల్లాలో వైసీపీ పూర్తిగా హవా నడిచింది. ఇప్పటికీ జిల్లాలో వైసీపీకి బలం ఉంది. మొదట వైసీపీ స్ట్రాంగ్ గా ఉన్న నియోజకవర్గాలు చూస్తే..మాచర్ల, గుంటూరు ఈస్ట్, నరసారావుపేట, గురజాల, పెదకూరపాడు స్థానాల్లో వైసీపీకి లీడ్ ఉంది. ఇక గుంటూరు వెస్ట్, రేపల్లె, వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లి స్థానాల్లో స్ట్రాంగ్ గా ఉంది. అటు ప్రత్తిపాడులో కూడా బలంగా కనబడుతుంది. తెనాలిలో టిడిపి-జనసేన పొత్తు ఉంటే వైసీపీకి ఇబ్బంది గాని..లేదంటే వైసీపీ గెలవడం ఖాయం. మొత్తం మీద చూసుకుంటే గుంటూరులో వైసీపీకి ఆధిక్యం కనిపిస్తుంది.