ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తాజాగా తెలంగాణలోని టీడీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణాలో త్వరలో రానున్న ఎన్నికల గురించి, ప్రస్తుతం టీడీపీకి ఉన్న అనుకూలతలు ప్రతికూలాతహలా గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రజల్లో మైలేజ్ బాగున్న BRS ను తట్టుకుని అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడు. ఈ విషయం గురించి ఢిల్లీ పర్యటనలో బీజేపీ అధిష్టానంతో మాట్లాడి ఒక మాట తీసుకున్నారట. తెలంగాణాలో టీడీపీ మరియు బీజేపీ లు కలిసి ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ ను ఢీ కొట్టడమే ప్రధాన ప్రణాళిక అని స్ఫష్టంగా తెలుస్తోంది.
కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం మేము ఎటువంటి పొత్తులు పెట్టుకోబోమని చెబుతున్నారు. మొత్తానికి లోలోపల రహస్య రాజకీయ ఒప్పందాలు వ్యూహాలు జరుగుతున్నాయి.