వంట నూనెల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా, ధార బ్రాండ్ వంట నూనెల ధరలను తగ్గిస్తున్నట్లు మదర్ డైరీ ప్రకటించింది. ఒక లీటరుకు గరిష్ట చిల్లర ధరపై రూ. 10 తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో లభించే కొన్ని కంపెనీల వంట నూనెల ధరలు లీటర్‌కు రూ. 125 నుంచ రూ. 135 మధ్య ఉన్నాయి. ఇవి కూడా తగ్గిస్తే లీటర్‌కు రూ. 115 వరకు వచ్చే అవకాశం ఉంది.
అంతర్జాతీయ మార్కెట్ల ధరలకు అనుగుణంగా, వంట నూనెల ధరలను తగ్గించాల్సిన అవసరం ఉందంటూ వంటనూనెల పరిశ్రమ సంఘానికి (ఎస్‌ఈఏ) ఆహార మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మదర్ డెయిరీ తాజా నిర్ణయం తీసుకుంది.కంపెనీ వివరాల ప్రకారం, సోయాబీన్ ఆయి కొత్త ధర లీటర్‌కు రూ. 140కి దిగిరాగా, రైస్ బ్రాన్ నూనె ఎంఆర్‌పీ లీటర్‌కు రూ. 160, పొద్దుతిరుగుడు నూనె లీటర్‌కు రూ. 150, వేరుశెనగ నూనె లీటర్‌కు రూ. 230 కు తగ్గింది. ఇదే దారిలో మరికొన్ని కంపెనీలు ధరలు తగ్గించనున్నట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి.