సింహం సింహమే.. జగన్ పేరు చెపితే సింహం గుర్తుకు వస్తుంది – కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి

-

సింహం సింహమే.. జగన్ పేరు చెపితే సింహం గుర్తుకు వస్తుందని కొనియాడారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. చంద్రబాబు నాయుడు కు ఒంటరిగా పోటీ చేసే దమ్ము ధైర్యం లేదని..ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తాడే తప్ప ఎప్పుడు కూడా సింగల్ గా వచ్చింది లేదంటూ చురకలు అంటించారు.

సింహం సింహమే.. జగన్మోహన్ రెడ్డి పేరు చెపితే సింహం గుర్తుకు వస్తుందన్నారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఎవరితో పొత్తులు లేకుండా సింగల్ గా వస్తాడని.. ప్రజల మధ్య ఉంటాడు ప్రజలం కష్ట సుఖాలు తెలుసుకుంటాడని చెప్పారు.

ఎన్నికల్లో పోరాడాలంటే ఏకపక్షంగా ఒంటరిగా రావాలి…రకరకాల పొత్తులతో ప్రజల్లోకి వచ్చి గెలవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు నాయుడు సంగతి తెలిసిందే.. ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవటం వాళ్లకు విడాకులు ఇవ్వటం.. మళ్లీ కొత్త సంబంధం కోసం ఎదురు చూడటం అలవాటే కదా అంటూ ఎద్దేవా చేశారు. బిజెపి…. సిపిఎం.. సిపిఐల తో కాపురం చేశాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంటపడుతున్నాడని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news