ఇలా చేస్తే కడుపులో మంట, కడుపు ఉబ్బరం కి చెక్ పెట్టేయచ్చు..!

-

కొంతమందికి తరచూ ఉదార సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి కడుపులో మంట కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులతో బాధపడతారు. అయితే ఇవి యాసిడ్ రిఫ్లెక్స్ కి సంకేతాలు అవ్వచ్చు. యాసిడ్ రిఫ్లెక్స్ అంటే కడుపులోనే ఆసిడ్ అన్నవాహిక పైకి వెళ్లి ఛాతి లో మంట ఇబ్బందుని కలిగిస్తుంది. తరచుగా ఇలా జరుగుతున్నట్లయితే గ్యాస్ట్రో ఎసోఫాగియర్ రిఫ్లెక్స్ వ్యాధికి ఇది దారి తీస్తుంది.

అందుకని జాగ్రత్తగా ఉండాలి ఏమైనా ఇబ్బందులు కలిగితే డాక్టర్ని సంప్రదించాలి. అధిక ఉష్ణోగ్రత చెమట వేడి జీర్ణవ్యవస్థని పాడు చేస్తుంది. ఎసిడిటీ వంటి ఇబ్బందులు కలగొచ్చు. ఈ ఇబ్బందుల నుండి బయట పడాలంటే ఈ డ్రింక్స్ బాగా హెల్ప్ అవుతాయి. మరి ఎటువంటి డ్రింక్స్ ని తీసుకుంటే ఈ బాధల నుండి బయట పడొచ్చు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.

కూరగాయలతో చేసిన స్మూతీని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఈ బాధల నుండి బయటపడొచ్చు. బచ్చలి కూర, కీరా వంటి వాటిని మీరు స్మూతీ కింద చేసుకుని తీసుకోవచ్చు. కలబంద జ్యూస్ కూడా ఆరోగ్యానికి చక్కటి ప్రయోజనాలని అందిస్తుంది ఎసిడిటీ వంటి ఇబ్బందుల్ని తొలగిస్తుంది. గ్యాస్ కడుపు ఉబ్బరం ఇబ్బందుల్ని లేకుండా చేస్తుంది కలబంద జ్యూస్ ని తాగితే ఈ సమస్య ఉండదు హాయిగా ఉండొచ్చు.

హెర్బల్ టీలు కూడా తీసుకోవచ్చు హెర్బల్ టీ తీసుకుంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది. యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి వాపుని ఇది తగ్గిస్తుంది. అలానే కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులు ఉండవు. చమోమెలీ టీ వంటివి తీసుకోవచ్చు. సోంపు నీళ్లు కూడా తీసుకోండి సోంపు నీళ్లు కూడా ఈ బాధల్ని దూరం చేస్తాయి. కొబ్బరి నీళ్లతో కూడా ఈ సమస్యలు దూరం అవుతాయి. కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఎలక్ట్రోలైట్స్ విటమిన్స్ మినరల్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి ఇలా వీటిని మీరు తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉండొచ్చు కడుపులో మంట కడుపు ఉబ్బరం వంటివి క్షణాల్లో దూరమవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news