బీఆర్ఎస్-కాంగ్రెస్ ఒక్కటే..బీజేపీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

-

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే..కాదు కాదు బీఆర్ఎస్-బి‌జే‌పి ఒక్కటే అని చెప్పి..మొన్నటివరకు అటు బి‌జే‌పి, ఇటు కాంగ్రెస్ నేతలు విమర్శలు చేసుకున్నారు. అయితే కొంతకాలం ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. మళ్ళీ తాజాగా బి‌జే‌పి మొదలుపెట్టింది. బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ ఒక్కటే అని అంటుంది. గతంలో రాష్ట్రంలో బి‌జే‌పి బాగా రేసులో ఉండటం..కే‌సి‌ఆర్ సైతం బి‌జేపిని టార్గెట్ చేసిన నేపథ్యంలో..ఆ రెండు పార్టీలు ఒక్కటే అని రేవంత్ రెడ్డి విమర్శించేవారు.

బి‌జే‌పికి ఓటు వేస్తే బి‌ఆర్‌ఎస్‌కు వేసినట్లే అని, మొన్నటివరకు కేంద్రంలో సహకరించుకుని..మళ్ళీ కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి కే‌సి‌ఆర్..బి‌జే‌పిని పైకి లేపుతున్నారని విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ అనుహ్యాంగా రేసులోకి వచ్చింది. ఆ పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. బడా బడా నేతలు..ఆ పార్టీలోకి వస్తున్నారు. దీంతో కాస్త వెనుకబడ్డ బి‌జే‌పి..బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ ఒక్కటే అంటూ విమర్శలు చేస్తుంది.  కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను గెలిపిస్తే బీఆర్‌ఎస్​లో చేరుతారని,  బీజేపీతోనే తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం సాధ్యమవుతుందని కిషన్ రెడ్డి అన్నారు.

తెలంగాణలో బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని… ఒంటరిగా పోటీ చేస్తామని, బి‌ఆర్‌ఎస్ తో తాము ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదని బండి సంజయ్ అన్నారు. అయితే బి‌ఆర్‌ఎస్ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ కు పడకుండా చేయడానికి..ఆ రెండు పార్టీలు ఒక్కటే అని బి‌జే‌పి ప్రచారం చేస్తుంది. కానీ ఈ ప్రచారం ప్రజలు ఎంతవరకు నమ్ముతారో చెప్పలేం.

జాతీయ స్థాయిలో పరిస్తితి ఎలా ఉన్న..తెలంగాణలో మాత్రం బి‌ఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు పోరు ఉంది. ఆ రెండు పార్టీల మధ్యే పోరు ఎక్కువ నడవనుంది. కానీ మధ్యలో రేసులోకి రావాలని బి‌జే‌పి ట్రై చేస్తుంది. అందుకే ఆ రెండు పార్టీలు ఒక్కటే అంటుంది. ఈ ప్రచారం ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news