విద్యారంగంలో జగన్ సంస్కరణలు అద్భుతం : లక్ష్మీపార్వతి

-

విద్యారంగంలో సీఎం జగన్ చేసిన మార్పులు చూస్తుంటే మళ్లీ బడికి వెళ్లి చదుకోవాలనిపిస్తోందని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. సంక్షేమం, అభివృద్ధి… రెండు కళ్లుగా భావించి యువనేత సీఎం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నారని ఆమె కొనిడాయారు. “విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వడం, విద్యాబోధనలో డిజిటలైజేషన్, ఒకటో తరగతి నుంచే పిల్లలకు అమ్మ ఒడి సహా అన్ని పథకాలు వర్తింపజేయడం, వారికి బట్టలు, బూట్లు, బ్యాగులు, పుస్తకాలు, స్కూళ్లలో చక్కని బెంచీలు, బోర్డులు, పరిశుభ్రమైన టాయిలెట్లు… ఇదండీ పరిపాలన అంటే. ఎవరికి ఏది అవసరమో అది అందించేదే నిజమైన పరిపాలన అవుతుందని అన్నారు.

Lakshmi Parvathi: Latest News, Videos and Photos of Lakshmi Parvathi | The  Hans India - Page 1

“విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వడం, విద్యాబోధనలో డిజిటలైజేషన్, ఒకటో తరగతి నుంచే పిల్లలకు అమ్మ ఒడి సహా అన్ని పథకాలు వర్తింపజేయడం, వారికి బట్టలు, బూట్లు, బ్యాగులు, పుస్తకాలు, స్కూళ్లలో చక్కని బెంచీలు, బోర్డులు, పరిశుభ్రమైన టాయిలెట్లు… ఇదండీ పరిపాలన అంటే. ఎవరికి ఏది అవసరమో అది అందించేదే నిజమైన పరిపాలన అవుతుంది. అధికారం అంటే దోపిడీ చేయడం కాదు. చంద్రబాబూ, నువ్వు ఐదు లక్షల కోట్లు సంపాదించవచ్చు కానీ నీ చరిత్రను ఎంత హీనంగా రాస్తారో అర్థమవుతోందా? నీ కొడుకుకైనా సంస్కారం నేర్పించావా అంటే అదీ లేదు. ఓ పనికిమాలిన వెధవలా తయారుచేశావు. వాడికి మూడు శాఖలతో మంత్రి పదవి ఇచ్చావు… వాడికి చదవడం రాదు, రాయడం రాదు” అంటూ లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news