బుజ్జగింపు రాజకీయాలతో దేశానికి నష్టమే పీఎం నరేంద్ర మోడీ

-

మధ్యప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ రాష్ట్రానికి చెందిన రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎన్నికల సన్నాహాలు ప్రారంభించారు. ఇతర చిన్న పార్టీలు కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాయి.ఈ నేపథ్యంలో భోపాల్‌లో జరిగిన ‘మేరా బూత్ సబ్సే స్ట్రాంగ్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేశారు. ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడిన ఆయన.. బుజ్జగింపు రాజకీయాలు దేశానికి చాలా నష్టం కలిగించాయని అన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ యూనిఫాం సివిల్ కోడ్‌ను సమర్థించారు.రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు యూనిఫాం సివిల్ కోడ్‌ను ఉపయోగించుకుంటున్నాయని అన్నారు. సుప్రీంకోర్టు కూడా UCCని అమలు చేయాలని కోరింది. ఇది కాకుండా, బిజెపి ముస్లిం సమాజ ప్రజలను సంప్రదించి వారిలో ఉన్న గందరగోళ పరిస్థితులను తొలగిస్తుందని భరోసా ఇచ్చారు.

యూసీసీపై ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై ప్రతిపక్ష పార్టీల రాజకీయ నాయకులు వారి స్పందనను తెలియజేశారు. మరీ ముఖ్యంగా ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, కెసి త్యాగి మొదలుకుని అనేక ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాని మోదీపైనా, బీజేపీ ప్రభుత్వంపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒబామా సలహాను మోడీ జీ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. HUF వలన దేశం ప్రతి సంవత్సరం ₹3064 కోట్ల నష్టాన్ని చవిచూస్తోందని అన్నారు.ఒకవైపు పస్మాండ ముస్లింల కోసం మొసలి కన్నీరు కారుస్తూ, మరోవైపు మీ బంటులు వారి మసీదులపై దాడులు చేస్తున్నారు, వారి ఉద్యోగాలు లాక్కోవడం, వారి ఇళ్లను బుల్డోజర్లుతో కూల్చడం,హత్యలు చేయడం వంటివి తగదన్నారు.

యూనిఫాం సివిల్ కోడ్ గురించి ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ కూడా స్పందించింది. కాంగ్రెస్‌ నేత తారిఖ్‌ అన్వర్‌ మాట్లాడుతూ చట్టం రూపొందించినప్పుడు అది అందరికి సంబంధించినది, ప్రతిఒక్కరు దానిని అనుసరించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పటికే ఆమోదం పొందిన బిల్లుపై చర్చించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news