ప్రస్తుత సమయంలో దేశంలో గవర్నర్ వ్యవస్థ అవసరం లేదన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. గవర్నర్ వ్యవస్థ బ్రిటిష్ కాలం నాటిదని అన్నారు. దేశంలో గవర్నర్ లు ఇప్పుడు రాజకీయ పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పాలన లో గవర్నర్ రాజకీయ వ్యవస్థగా మారిందని మాడిపడ్డారు తమ్మినేని. తమిళనాడులో మంత్రిని తొలగించే అధికారం గవర్నర్ కు ఎక్కడిదని ప్రశ్నించారు. మంత్రిని తొలగించే అధికారం సీఎంకు మాత్రమే ఉంటుందన్నారు.
తమిళనాడు గవర్నర్ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణ గవర్నర్ కూడా యూనివర్సిటీ బిల్లును ఆపి విద్యార్థులకు నష్టం చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ పై కోపం తో తెలంగాణ గవర్నర్ ఈ విధంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. మణిపూర్ లో రాజకీయ లబ్ది కోసం బీజేపీ ప్రయత్నిస్తుందని.. మణిపూర్ లో ఓ వర్గాన్ని బీజేపీ ప్రోత్సహిస్తుందని కీలక ఆరోపణలు చేశారు తమ్మినేని. సీట్లపై చర్చించేందుకు సీఎం అపాయిట్మెంట్ అడిగామని.. రాగానే చర్చిస్తామన్నారు.