ఎడిట్ నోట్: హస్తం అదరగొట్టింది..అధికారం దక్కేనా?

-

మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది..వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమి…అధికారం కోల్పోవడం…పెద్ద పెద్ద నేతలు వీడిపోవడం..ఇంకా కాంగ్రెస్ పని అయిపోయిందనే పరిస్తితి నుంచి…మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే పరిస్తితికి వచ్చింది. మొన్నటివరకు రాజకీయ యుద్ధం బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పిల మధ్యే జరిగింది. కానీ తర్వాత సీన్ మారింది.కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో..తెలంగాణలో ఆ పార్టీకి ఊపు వచ్చింది.

ఇక నేతల వలసలు కూడా కాంగ్రెస్ లోకి మొదలయ్యాయి. భారీ స్థాయిలో వలసలు రావడంతో కాంగ్రెస్‌కు నూతన ఉత్సాహం వచ్చింది. ఇదే సమయంలో ఖమ్మంలో భారీ సభ పెట్టడం..రాహుల్ గాంధీ రావడంతో మరింత జోష్ వచ్చింది. రాహుల్ సమక్షంలో భారీ చేరికలు జరిగాయి. ఇక రాహుల్ సైతం ఖమ్మం వేదికగా కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బి‌జే‌పికి బి‌ఆర్‌ఎస్ బీ టీం అంటూ  ఫైర్ అయ్యారు. ఆ రెండు పార్టీలు ఒక్కటే అని మాట్లాడారు..కే‌సి‌ఆర్ ప్రభుత్వంలో అంతా అవినీతే..లిక్కర్ స్కామ్ గురించి ప్రధానంగా ప్రస్తావించారు.

తెలంగాణలో బి‌జే‌పి పని అయిపోయిందని, ఆ పార్టీ ఖతం అయిపోయిందని అన్నారు. ఇక పోటీ కాంగ్రెస్, బి‌ఆర్‌ఎస్ మధ్యే అని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం పలు హామీలు కూడా ఇచ్చారు. ఇప్పటికే కొన్ని కీలక హామీలు ఇచ్చిన కాంగ్రెస్..తాజాగా రాహుల్ సమక్షంలో రూ.4 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు.

ఇలా చేరికలు, రాహుల్ సభ, హామీలతో తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఊపు వచ్చింది. మరి ఇదే ఊపుతో అధికారం సాధిస్తారా? అంటే అది కష్టమే అని చెప్పాలి. బలంగా ఉన్న బి‌ఆర్‌ఎస్ పార్టీని ఢీకొట్టి అధికారం దక్కించుకోవడం ఈజీ కాదు. అటు బి‌జే‌పి ఎంతవరకు ఓట్లు చీలుస్తుందో తెలియడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఇంకా కష్టపడాలి. అదే సమయంలో కాంగ్రెస్ నేతల్లో ఇంకా సఖ్యత కనిపించడం లేదు. ఇది పెద్ద ఇబ్బంది. ఎప్పుడైతే వారు ఐక్యతతో పనిచేస్తారో..అప్పుడే కాంగ్రెస్ కు అధికారం సాధ్యమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news