వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్ళీ గెలుస్తుందా? అంటే నో డౌట్ మళ్ళీ వైసీపీ వన్ సైడ్ గా గెలిచేస్తుంది..175కి 175 సీట్లు సాధిస్తుందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. జగన్ టార్గెట్ కూడా అలాగే ఉంది. 175 సీట్లు సాధించాలని అంటున్నారు. అయితే కొందరు మాత్రం 175 రావడం జరిగే పని కాదు గాని…110-120 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తామని చెబుతున్నారు.
సరే ఎలా చెప్పిన అధికారం మాత్రం తమదే అని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే పరిస్తితి వైసీపీ విజయానికి అనుకూలంగా ఉన్నాయా? అంటే ఉన్నాయనే చెప్పాలి. ఇప్పుడున్న పరిస్తితుల్లో ప్రజలు జగన్ వైపే ఉన్నారు. సంక్షేమ పథకాల లబ్దిదారులు వన్ సైడ్ గా జగన్ వైపు ఉన్నారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఇటీవల వస్తున్న నేషనల్ సర్వేల్లో వైసీపీకి 24-25 ఎంపీ సీట్లు వస్తానని చెబుతున్నాయి. అంటే ఏపీలో ఉన్నది 25ఎంపీ సీట్లు..మొత్తం వైసీపీ స్వీప్ చేస్తుందని అంటున్నాయి.
అందుకే అన్నీ సీట్లలో తాము గెలుస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే అన్నీ గెలవాలని అనుకోవడంలో పోయేదేమీ లేదు. కాకపోతే రియాలిటీలో లేకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తో పోతేనే ఇబ్బంది. ఇప్పటికీ వైసీపీకి గెలిచే అవకాశాలు ఎక్కువే. కాకపోతే ఇక్కడ చిక్కు వచ్చి టిడిపి-జనసేన పొత్తు. ఈ పొత్తు వల్ల కాస్త ఫలితం మారే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో వైసీపీకి రిజల్ట్ బెడిసికొట్టే ఛాన్స్ ఉంది. అక్కడ మెజారిటీ సీట్లు టిడిపి-జనసేన దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక సీమలో వైసీపీ ఎలాగో సత్తా చాటుతుంది..అందులో ఎలాంటి డౌట్ లేదు. ఉత్తరాంధ్రలో ఫిఫ్టీ-ఫిఫ్టీ ఛాన్స్..అంటే వైసీపీకి అధికారం అంత ఈజీ కాదు. కాబట్టి కోస్తాలో మెజారిటీ సీట్లు లాగాలి. టిడిపి, జనసేన పొత్తుకు చెక్ పెట్టాలి. ఆ రెండు పార్టీల మధ్య ఓట్లు బదిలీ కాకుండా చూసుకోవాలి..అప్పుడే వైసీపీ వన్‌సైడ్ విక్టరీ సాధ్యమవుతుంది.