జగనన్న ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలను ప్రధమంగా పెట్టుకుని నెరవేరుస్తూ వెళుతున్నాడు. అందులో భాగంగా గత విద్యాసంవత్సరానికి సంబంధించి అమ్మఒడి పధకాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో జూన్ 28వ తేదీన ట్రాన్స్ఫర్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటికీ కొందరు తల్లుల అకౌంట్ లో అమ్మఒడి డబ్బులు పడలేదని సచివాలయాలకు కంప్లైంట్ లు వస్తున్నాయి. ఈ అంశంపై స్పందించిన ప్రభుత్వం అమౌంట్ పడని విద్యార్థుల తల్లులు కంగారు పడవలసిన అవసరం లేదు. కొందరికి అమ్మఒడి స్టేటస్ లో ఎలిజిబిల్ లో చూపిస్తున్నా… అమౌంట్ పడకపోతే వెంటనే సంబంధిత సచివాలయానికి వెళ్లి ఈ కెవైసి ని పూర్తి చేసుకోవలెను… అప్పుడు అలాంటి వారికి జులై 7వ తేదీ లోపు అమ్మఒడి డబ్బులు ఖాతాలో పడుతాయని తెలిపింది.
ఈ వార్తతో ఊపిరి పీల్చుకున్న లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లి ఈ కెవైసి లను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు.