సలార్ – కేజిఎఫ్ 2 ల మధ్య లింక్ నిజమేనా..?

-

కేజిఎఫ్ 2 సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ సినిమా కంటే కూడా పది రెట్లు ఎక్కువగా ఉండేలా సలార్ మూవీ ని రూపొందించారు అని కామెంట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే కేజీఎఫ్ ప్రస్తావన లేకుండా ఇక్కడ సలార్ గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా సలార్ మూవీ కి సంబంధించిన టీజర్ ను విడుదల చేసే డేట్ అండ్ టైం కూడా ఫిక్స్ చేసి అఫీషియల్ పర్యటన చేయడం జరిగింది. దాంతో మరొకసారి కేజిఎఫ్ 2 సినిమాతో సలార్ సినిమాకు ముడి పెట్టడం మొదలు పెట్టేసారు అభిమానులు.

ఇకపోతే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ ఇందులో హీరోగా నటిస్తున్నార. ఇక ఈ సినిమా టీజర్ కు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ 2 సినిమాకి ఉన్న సంబంధం ఇదే అంటూ కూడా ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. టీజర్ రిలీజ్ చేస్తున్న సమయానికి అలాగే కేజిఎఫ్ పార్ట్ 2 క్లైమాక్స్ కి చాలా పెద్ద లింకు ఉందని ఈ విధంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు.

ఇంకా అసలు విషయంలోకి వెళ్తే కేజిఎఫ్ 2 క్లైమాక్స్లో రాఖీ బాయ్ పై జరిగే ఎటాక్ కూడా దాదాపు అదే సమయంలో జరుగుతుందని రాఖీ బాయ్ కరెక్ట్ గా సాయంత్రం 5: 12 కి సముద్రంలో పడిపోతాడు.. ఆ తర్వాత సలార్ తో మొదలవుతుంది అంటూ ఒక వార్త నెట్ లో చాలా వైరల్ గా మారుతుంది. మొత్తానికైతే ఈ విషయం యాదృచ్ఛికంగా జరిగేందని కొంతమంది కొట్టి పారేస్తుండగా మరి కొంతమంది లింకు ఉందని చెబుతున్నారు. ఇక సినిమా రిలీజ్ అయ్యే వరకు పూర్తి విషయాల కోసం ఎదురు చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news