కూతురు ప్రేమపెళ్లి.. యువకుడి ఇంటికి నిప్పంటించిన సర్పంచ్

-

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటిక్యాలలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇటిక్యాల సర్పంచి కూతురు ఓ యువకుడిని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇది కులాంతర వివాహం కావడంతో సర్పంచ్ భర్త మండల రవీందర్ వీరంగం సృష్టించాడు. కూతురు కావ్య శ్రీ అదే గ్రామానికి చెందిన జలగం రంజిత్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ ప్రేమ వివాహం ఇష్టం లేని ఆమె తండ్రి ఆగ్రహంతో ఆ యువకుడి ఇంటితోపాటు వారికి సహకరించిన ఇద్దరు స్నేహితుల ఇళ్లపై దాడి చేయించాడు.

వారి ఇళ్లకు నిప్పంటించడంతో ఫర్నిచర్ దగ్ధమైంది. అయితే తన తండ్రి ఇలాంటిదే ఏదో చేస్తాడన్న అనుమానంతో ఆ యువతి ముందుగానే సెల్ఫీ వీడియో కూడా విడుదల చేసింది. ఆ వీడియోలో తాను తన ఇష్టపూర్వకంగానే అతడిని పెళ్లి చేసుకున్నానని తెలిపింది. ప్రస్తుతం తాను సంతోషంగానే ఉన్నానని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news