రానున్న ఎన్నికల్లో మళ్ళీ సత్తా చాటి అధికారం దక్కించుకోవాలని జగన్ చూస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల మాదిరిగానే ఈ సారి కూడా భారీ విజయం అందుకోవాలని అనుకుంటున్నారు. అయితే గత ఎన్నికల్లో నాలుగు ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ స్వీప్ చేసింది..ఇప్పుడు కొత్త జిల్లాల్లో కనీసం 7-8 స్వీప్ చేయాలని చూస్తుంది. అయితే వైసీపీకి స్వీప్ అవకాశం ఉన్న జిల్లాలు ఎక్కువగానే ఉన్నాయి.
ఆ జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా కూడా ఒకటి. ఇక్కడ వైసీపీకి పూర్తి బలం ఉంది. రాష్ట్రంలో ఉండే గాలితో సంబంధం లేకుండా ఇక్కడ వైసీపీ గెలుస్తుంది. గత రెండు ఎన్నికల్లో అదే జరుగుతుంది. ఈ జిల్లాలో మొత్తం 3 సీట్లు ఉన్నాయి. అరకు, పాడేరు, రంపచోడవరం..మూడు ఎస్టీ స్థానాలు…గిరిజన ప్రాంతాలు. ఈ ప్రాంత ప్రజలు వైఎస్సార్ పై అభిమానం ఎక్కువ. అదే అభిమానం జగన్ పై కంటిన్యూ అవుతుంది. గత రెండు ఎన్నికల్లో ఈ మూడు సీట్లని వైసీపీనే గెలుచుకుంటుంది.
ఈ సారి కూడా గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మూడు చోట్ల వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు ఏమి పెద్దగా బాగోలేదు. కానీ జగన్ పై అభిమానమే వైసీపీకి బలం…ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు భారీ ప్లస్. అందుకే ఇప్పటికీ అక్కడ వైసీపీదే హవా.,
ఈ మూడు చోట్ల టిడిపి వీక్ గా ఉంది. నాయకులు ఉన్నారు గాని..పార్టీ బలపడటం లేదు. దీంతో మళ్ళీ ఇక్కడ ఒక్క సీటు కూడా టిడిపి గెలవదు. మొత్తం మూడు సీట్లు వైసీపీ గెలుచుకుని అల్లూరి జిల్లాలో స్వీప్ చేయనుంది.