అన్నం తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చెయ్యకండి.. సంపద అంతా కూడా పోతుంది..!

-

అన్నం తినేటప్పుడు అసలు ఈ తప్పులే చేయకూడదు. అన్నం తినేటప్పుడు ఇలాంటి తప్పులు చేశారంటే అనవసరంగా సంపదకి నష్టం కలుగుతుంది. మరి అన్నం తినేటప్పుడు పక్కా పాటించాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. రాత్రి పూట అందరూ నిద్రపోయాక ఆహారం తీసుకోకూడదు. అందరూ నిద్ర పోయిన తర్వాత తింటే సంపద మొత్తం పోతుంది.

అలానే కాళ్లు చాపి ఆహారం తీసుకుంటే కూడా సంపద పోతుంది అప్పులు బాగా పెరుగుతాయి. భోజనం చేసేటప్పుడు మూలన కూర్చుని తింటే కూడా ధన నష్టం కలుగుతుంది. తడికాళ్లతో అన్నం తింటే కూడా ధనాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. స్నానం చేయకుండా భోజనం చేస్తే ఐశ్వర్యం తరిగిపోతుంది.

భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. దోషం చుట్టుకుంటుంది ఎవరింటికైనా అతిథిగా వెళ్లి భోజనం చేసి లోపాన్ని కనుక చూపిస్తే పాపం కలుగుతుంది. వంటగదిలో కూర్చుని తింటే కూడా దోషమే. పండగ పూట మాంసాహారాన్ని తింటే ఆరోగ్యం ఐశ్వర్యం పోతాయి ఇతరుల ఆహార పదార్థాలని దొంగలించి తింటే దరిద్రం పట్టుకుంటుంది కనుక తినేటప్పుడు ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news