తిరుమలలో 800 కిలోవాట్ల పవన్ విద్యుత్ టర్బైన్ ఏర్పాటు కానుంది. ముంబైకి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ తిరుమలలో 800 కిలోవాట్ల పవన్ విద్యుత్ టర్బైన్ ను ఉచితంగా ఏర్పాటు చేయనుంది. దీనివల్ల ఏడాదికి 18 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఏటా రూ. 90 లక్షల మేర విద్యుత్ ఖర్చు ఆదా అవుతుందని TTD అధికారులు తెలిపారు.
తిరుమలలో ఏటా 4.5 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. దీనిలో కోటి యూనిట్లు తిరుమలలో ఉన్న పవన విద్యుత్ ద్వారా సమకూరుతోంది. కాగా, కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. శ్రీవారి సర్వదర్శనం కోసం కంపార్ట్మెంటు అన్నీ నిండి… కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 66,977 మంది భక్తులు దర్శించుకున్నారు. 330,20 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న వెంకటేశ్వరుని హుండీకి రూ. 4.39 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.