శ్రీరాంసాగర్ లోకి కాళేశ్వరం జలాలను విడుదల చేశారు బిఆర్ఎస్ నేతలు. రివర్స్ పంపింగ్ ద్వారా ముప్కాల్ పంప్ హౌస్ వద్ద నాలుగు పంపుల ద్వారా జలాశయం లోకి నీటిని విడుదల చేశారు స్పీకర్ పోచారం, మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ స్పీకర్ సురేష్ రెడ్డి ,పలువురు ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. గంగను రివర్స్ చేసి నీటిని శ్రీరాంసాగర్ లోకి తీసుకురావడం ఒక అద్భుతం అన్నారు.
ఇక సీఎం కేసీఆర్ పై భారీ కుట్ర జరుగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో తెలంగాణ నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రులను ఒక సంవత్సరం కూడా వుండనియలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి తెలంగాణ జలాలు ,తెలంగాణ సాంకేతిక అభివృద్ధిని దోచుకునే కుట్ర జరుగుతుందన్నారు. కేసీఆర్ ఉంటే నిండా నింపిన విస్తరి ఆకు అవుతుందని.. ఆదమరిస్తే కుక్కలు చింపిన విస్తరి ఆకు అవుతుందన్నారు.