“ఖుషి” సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్!

-

డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం “ఖుషీ”. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జయరాం, సచిన్ ఖడేగర్, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వాహబ్ ఈ లవ్ స్టోరీకి సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ 1 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలోనుండి ఇప్పటికే “నా రోజా నువ్వే” అంటూ సాగే పాటని రిలీజ్ చేయగా యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. “ఆరాధ్య” అనే పాట ప్రోమో ని సోమవారం సాయంత్రం మేకర్స్ విడుదల చేశారు. సిద్ శ్రీరామ్, చిన్మయి పాడిన పాట మొదటి సాంగ్ లాగానే సూపర్ డూపర్ హిట్ కానున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news