పవన్‌.. మేం చాటలు.. చెప్పులు ఎత్తితే నీ గతేంటో తెలుసుకో : పోతుల సునీత

-

వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత [ఆహ్వానం కళ్యాణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు. పవన్ కల్యాణ్‌కు ఇదే మా హెచ్చరిక.. మేం చాటలు.. చెప్పులు ఎత్తితే నీ గతేంటో తెలుసుకో అంటూ హెచ్చరించారు. ఈ రోజు డీజీపీని కలిసింది వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం.. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతూ డీజీపీకి ఫిర్యాదు వారు ఫిర్యాదు చేపట్టారు. వెంటనే పవన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు . ఇక ఈ నేపధ్యం లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వాలంటరీ వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలు హేయమైనవి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం వాలంటరీ వ్యవస్థను మెచ్చుకున్నారు.. కరోనా సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు దేశానికే ఆదర్శంగా తెలిపిన ఆమె.. చంద్రబాబు, లోకేష్ లకు రాజకీయాలు చేసే దమ్ములేక పవన్ ను అడ్డం పెట్టుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు.

Andhra Pradesh legislative council chairman accepts Pothula Sunitha's  resignation

పవన్ కల్యాణ్‌.. టీడీపీ కోసమే రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు పోతుల సునీత.. చంద్రబాబు, లోకేష్ ల జేబు సంస్థగా పవన్ పని చేస్తున్నాడని సంచలనవ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు, లోకేష్, పవన్.. ఏపీకి టూరిస్టులు మాత్రమే.. కరోనా సమయంలో మీరంతా ఏమైపోయారు..? అంటూ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌కు మహిళలంటే గౌరవం లేదు.. వాలంటీర్లను చాలా చిన్న చూపు చూస్తున్నాడు.. తన వ్యక్తిగత జీవితంలో మహిళలను మోసం చేసిన మోసగాడు పవన్ అంటూ మండిపడ్డారు. అందుకే వాలంటీర్ల పట్ల పవన్ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు అంటూ విరుచుకుపడ్డారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news