వానా కాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇటువంటి సమస్యలు ఏమి రాకుండా ఉండాలంటే ఆయుర్వేదం చాలా చక్కగా పనిచేస్తుంది ఆయుర్వేదం ఆరోగ్యాన్ని బాగా కాపాడుతుంది. ఆయుర్వేదం ద్వారా మనం అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు. ఆరోగ్యాన్ని పెంచడానికి మూలికలు బాగా సహాయపడతాయి వానా కాలంలో ఈ మూలికలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. మంజిష్ఠ చాలా చక్కగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని మంజిష్ఠ పెంచుతుంది. మూత్రపిండాలు, చర్మాన్ని శుభ్రపరుస్తుంది.
జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది ఎలర్జీల బారిన పడకుండా చూస్తుంది. తులసిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు కూడా కలిగి ఉంటుంది తులసి. తులసిని తీసుకుంటే వాన కాలంలో అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ఉండొచ్చు అదేవిధంగా వేప, అశ్వగంధ కుడా అనారోగ్య సమస్యలు బారిన పడకుండా కాపాడతాయి. బ్రహ్మీ కూడా ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. బ్రహ్మి వలన కూడా అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
జ్ఞాపకశక్తి ని బ్రహ్మి తో పెంచుకో వచ్చు ఒత్తిడి డిప్రెషన్ వంటి ఇబ్బందులు కూడా ఉండవు నాడీ వ్యవస్థ పని తీరుని కూడా ఇది మెరుగు పరుస్తుంది ఇలా ఈ మూలికలతో మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. వానా కాలంలో వీటిని తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఏమి కూడా కలగవు కాబట్టి వానా కాలంలో వీటిని తీసుకుని ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండండి.