తెలంగాణ ముస్లింలకు శుభవార్త..ఇక వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం !

-

తెలంగాణ ముస్లింలకు శుభవార్త చెప్పింది కేసీఆర్‌ సర్కార్‌. ఇక వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు కీలక ప్రకటన చేశారు. మైనార్టీల కోసం లక్ష రూపాయల ఆర్థిక సాయం స్కీం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలనలో ఉందని వెల్లడించారు హరీష్‌రావు.

త్వరలో ఈ స్కీమ్ అమలవుతుందని చెప్పారు. అటు రేవంత్ రెడ్డి పై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ సంఘ్ పరివార్ కార్యకర్త అంటూ నిప్పులు చెరిగారు. రేవంత్ RSS, ABVP లో పనిచేశారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం…సంఘ్ పరివర్ లో ప్రారంభం అని ఆరోపణలు చేశారు. ఇప్పుడు రేవంత్ పెద్దగా ఎదో మాట్లాడతారని.. ఆగ్రహించారు. గతంలో సోనియా గాంధీని బూతులు తిట్టి.. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నాడని ఫైర్‌ అయ్యారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news