వరుణ్ తేజ్– లావణ్య త్రిపాఠిల పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

-

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్న విషం తెలిసిందే. ఈ లవ్ బర్డ్స్.. నిశ్చితార్థం గత నెల 9వ తేదీన నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఎంగేజ్మెంట్ అయితే జరిగింది కానీ.. ఈ జంట తమ పెళ్లి ఎప్పుడో మాత్రం ఇప్పటికీ చెప్పలేదు. అయితే ఈ జంట వివాహం గురించి మెగా ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. పెళ్లి ఎప్పుడంటూ నెట్టింట తెగ ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సమాచారం మేరకు.. ఆగస్టు 24వ తేదీన పెద్దల సమక్షంలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటికాబోతున్నారని టాక్. వివాహం ఇటలీలో ఘనంగా జరగనుందని తెలుస్తోంది. పెళ్లికి నెల మాత్రమే సమయం ఉండటంతో ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. మరోవైపు కాబోయే కొత్త జంట షాపింగ్ కోసం విదేశాలకు చెక్కేసినట్లు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరూ పారిస్ లో పెళ్లి షాపింగ్ లో బిజీగా ఉన్నట్టు టాక్.

Read more RELATED
Recommended to you

Latest news