నిజమా.. రోజూ వాకింగ్‌ చేస్తే ఇన్ని లాభాలుంటాయా..!

-

బరువు తగ్గడం కోసం అధిక శాతం మంది జిమ్‌లని, యోగా సెంటర్లని పరిగెడుతున్నారు. కానీ అసలు అవేవీ అవసరం లేదు తెలుసా..? అంటే.. ఇదేదో మూలిక తినమని లేదంటే.. పొట్ట దగ్గర కొవ్వును కరిగించే సోనా బెల్ట్‌ తరహా వార్త కాదులెండి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే… సాధారణంగా బరువు తగ్గేందుకు చాలా మంది వెదుక్కునే దగ్గరి దార్ల గురించి పైన చెప్పాం కదా. అలా కాకుండా కేవలం వాకింగ్‌ ద్వారానే అధిక బరువు తగ్గవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. అసలు వాకింగ్‌ను చాలా మంది సీరియస్‌గా తీసుకోరు కానీ.. సరిగ్గా చేస్తే వాకింగ్‌ ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలను రాబట్టవచ్చు. అందుకే హిపోక్రాట్స్‌ అనే వైద్య రంగ నిపుణుడు క్రీస్తు పూర్వం 460వ సంవత్సరంలోనే వాకింగ్‌ ఈజ్‌ ఎ మ్యాన్స్‌ బెస్ట్‌ మెడిసిన్‌ అన్నారు. అవును, మీరు విన్నది నిజమే. అయితే మరి.. వాకింగ్‌ చేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!

1. రోజూ వాకింగ్‌ చేస్తే శరీరంలో ఎండార్ఫిన్లు అనబడే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి డిప్రెషన్‌, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలను దూరం చేస్తాయి. అంటే రోజూ వాకింగ్‌ చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుందన్నమాట.

2. నిత్యం వాకింగ్‌ చేస్తే కంటి ఆరోగ్యం మెరుగు పడుతుందట. కంటి చూపు పెరుగుతుందట. అలా అని మేం చెప్పడం లేదు. సైంటిస్టుల అధ్యయనాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. రోజూ వాకింగ్‌ చేస్తే కళ్లపై పెరిగే ఒత్తిడి తగ్గుతుంది. కళ్లకు విశ్రాంతి లభిస్తుంది.

3. రన్నింగ్‌ చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో సరిగ్గా అదేలాంటి లాభాలు వాకింగ్‌ చేయడం వల్ల కూడా కలుగుతాయట. సాక్షాత్తూ అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ఈ విషయాన్ని చెబుతోంది. నిత్యం వాకింగ్‌ చేస్తే హార్ట్‌ ఎటాక్‌లు, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది.

4. వాకింగ్‌ చేస్తే శరీరం ఆక్సిజన్‌ను ఎక్కువగా తీసుకుంటుంది. దీంతో శరీరంలో ఉండే విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.

5. డయాబెటిస్‌ ఉన్నవారికి వాకింగ్‌ దివ్యౌషధంగా పనిచేస్తుంది. వారి రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు కచ్చితంగా అదుపులోకి వస్తాయి. రోజూ వాకింగ్‌ చేస్తే డయాబెటిస్‌ కచ్చితంగా తగ్గుతుంది.

6. నిత్యం కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్‌ చేస్తే పెద్ద పేగు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.

7. నిత్యం వాకింగ్‌ చేయడం వల్ల అధిక బరువు తగ్గుతారు. కండరాలు దృఢంగా మారుతాయి.

8. వృద్ధాప్యంలోనూ కీళ్లు సరిగ్గా పనిచేయాలంటే నిత్యం వాకింగ్‌ చేయాలట.

9. వెన్ను నొప్పి సమస్యతో సతమతమయ్యే వారు వాకింగ్‌ చేస్తే ఫలితం ఉంటుంది.

10. డిప్రెషన్‌లో ఉన్న వారు నిత్యం వాకింగ్‌ చేస్తే మూడ్‌ మారుతుంది. సంతోషంగా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news