నిన్నటి నుండి జింబాబ్వే వేదికగా జిమ్ ఆఫ్రో టీ 10 లీగ్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొదటి రోజే సంచలన వరల్డ్ రికార్డ్ నమోదు అయింది. గత రాత్రి బులవాయో బ్రేవ్స్ మరియు జోబెర్గ్ బఫెల్లోస్ కు మధ్యన జరిగిన మ్యాచ్ లో.. పాకిస్తాన్ ఆల్ రౌండర్ మహమ్మద్ హఫీజ్ సంచలన స్పెల్ తో తన జట్టుకు మరపురాని విజయాన్ని అందించాడు. ఇతని ప్రదర్శన కారణంగా జోబెర్గ్ జట్టు 10 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో హఫీజ్ 2 ఓవర్లు బౌలింగ్ చేసి కీలకమైన 6 వికెట్లను పడగొట్టాడు. ఈ ప్రదర్శనకు గాను అతనికి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన జాబర్గ్ జట్టు నిర్ణీత ఓవర్ లలో 105 పరుగులకే పరిమితం అయింది, అనంతరం ఛేదనకు వచ్చిన బులవాయో బ్రేవ్స్ జట్టు అన్ని ఓవర్ లను ఆడి కేవలం 95 పరుగులు మాత్రమే చేయగలిగింది.
హఫీజ్ తన స్పిన్ మాయాజాలంతో సికందర్ రాజా, ర్యాన్ బూర్ల, పెరీరా, మారుమా, మిల్స్ మరియు మాకొని లను అవుట్ చేసి రికార్డ్ సృష్టించాడు.