కొందరు చదువుకునే రోజుల్లో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగానే తమ విద్యను కొనసాగిస్తూ ఉంటారు. అలాగే కొందరు చిన్నప్పటి నుండి బ్యాంక్ లోనే ఉద్యోగాన్ని సంపాదించాలని కసిగా పెట్టుకుని డిగ్రీ అయ్యాక బ్యాంక్ జాబుల కోసం నిరీక్షిస్తూ శిక్షణ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి తాజాగా ఒక అద్భుతమైన అవకాశం నోటిఫికేషన్ రూపంలో వచ్చిందని చెప్పాలి. అయితే బ్యాంకు లో ఏదో ఒక జాబ్ వచ్చినా పర్లేదు అనుకునే వారికి మాత్రమే ఇది సువర్ణావకాశం అని చెప్పాలి. IBPS తాజాగా ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 4545 బ్యాంక్ క్లర్క్ పోస్ట్ లను విడుదల చేసింది. కాగా ఇప్పటికే అందరూ దరఖాస్తులు చేసుకుంటూ ఉండగా.. ఈ అప్ప్లై చేసుకునే గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. లేటెస్ట్ డేట్ ప్రకారం జులై 28వ తేదీ వరకు అర్హులు అయిన అభ్యర్థులు ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చును.
ఇందుకు డిగ్రీ అర్హతగా తీసుకుంటుండగా… అభ్యర్థుల వయసు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను పెట్టు దాని ఫలితాల ఆధారంగా ఎంపిక చేస్తారు.