మంత్రి కేటీఆర్​కు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్

-

రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు నేడు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు కేటీఆర్ పుట్టిన రోజును ఘనంగా జరుపుతున్నారు. అయితే తన జన్మదినం సందర్భంగా ప్రచారానికి ఖర్చు చేయకుండా ఆ డబ్బును అనాథలకు అండగా నిలిచేందుకు ఉపయోగించాలని కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. మరోవైపు తన 47వ పుట్టిన రోజు సందర్భంగా 47 మంది అనాథ విద్యార్థులకు సాయం చేస్తానని కేటీఆర్ చెప్పారు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు.

మరోవైపు సోషల్ మీడియాలో కేటీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రతినిధులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ నేతలు సహా అంతా కేటీఆర్​కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కేటీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మై డియర్ బ్రదర్ తారక్.. మీరు నేను అభిమానించే ప్రేమించే అసలైన నాయకుడు. మమ్మల్ని మీరు ఎంతగానో ఇన్స్పైర్ చేస్తారు. మీరు ఆరోగ్యంతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో సెలబ్రేట్ చేసుకోవాలి. అంటూ చిరు ట్వీట్ చేశారు. చిరు ట్వీట్​కు కేటీఆర్ రియాక్ట్ అవుతూ థాంక్యూ సార్ అని రిప్లై ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news