ఏపీ ఉపాధ్యాయులకు బిగ్ షాక్…నెలాఖరుకు వచ్చినా అందని జీతాలు !

-

ఏపీ ఉపాధ్యాయులకు బిగ్ షాక్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అణాలోచిత నిర్ణయాల వల్ల సుమారు 60 వేల మంది ఉపాధ్యాయులకు జూన్ నెల జీతం ఇప్పటికీ రాలేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు బదిలీలు, ఉద్యోగన్నతులు కల్పించారు. వారందరికీ ఇంతవరకు జూన్ నెల జీతాలు చెల్లించకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.

జీతాల బిల్లులకు సంబంధించి సవరించిన క్యాడర్ స్ట్రెంగ్త్ ను విద్యాశాఖ సకాలంలో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ కు పంపకపోవడం వల్లే జీతాలు రాలేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సవరించిన క్యాడర్ స్ట్రెంగ్త్ పంపకపోవడం వల్ల 1792 మందికి జూన్ నెల జీతం, కొందరికి బకాయి పడిన మే నెల 10 రోజుల జీతం కూడా రాలేదు. పిజిటిల వివరాలు నేటికీ తమకు రాలేదని డిటిఏ మోహన్ రావు పాఠశాల విద్యాశాఖకు ఈ నెల 20న రాతపూర్వకంగా సమాచారం ఇచ్చారు. ఈ నెల 25లోగా వారి జీతాల బిల్లులు ట్రెజరీలకు చేరుకుంటే జూలై నెల జీతం కూడా చేతికి వచ్చే అవకాశం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news