ఐర్లాండ్ మరియు ఆస్ట్రేలియా ల మధ్య జరుగుతున్న మూడు వన్ డే ల సిరీస్ ఈ రోజుతో ముగిసిపోయింది. ఈ సిరీస్ లో ఆతిధ్య ఆస్ట్రేలియా మహిళలు 2 – 0 తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేశారు. మొదటి వన్ డే వర్షార్పణం కాగా, రెండవ వన్ డే లో ఆస్ట్రేలియా గెలిచింది. ఇక మూడవ వన్ డే లో మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది, ఐర్లాండ్ బ్యాటింగ్ లో నిర్ణీత ఓవర్ లలో 217 పరుగులకు ఆల్ అవుట్ అయింది. బౌలింగ్ లో ఆస్ట్రేలియా లో కిమ్ గార్త్ మరియు గార్డెనర్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అనంతరం పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మహిళలు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని కేవలం 36 ఓవర్ లలో ఛేదించి పది వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకున్నారు.
ఓపెనర్ లుగా వచ్చిన లీచ్ ఫీల్డ్ (106) మరియు సదర్ లాండ్ (109) లు ఇద్దరూ సెంచరీ లతో కదం తొక్కారు. ఐర్లాండ్ బౌలర్లు ఎవ్వరూ ప్రభావవంతంగా బౌలింగ్ చేయలేకపోయారు.