సముద్రంలో చిక్కుకున్న 36 మంది.. 30 గంటలు శ్రమించి ఒడ్డుకు చేర్చిన నేవీ

-

చేపలవేటకు వెళ్లి నడిసముద్రంలో 36 మంది మత్స్యకారులు చిక్కుకున్నారు. దాదాపు రెండురోజుల పాటు సముద్రంలోనే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఇండియన్ నేవీ సిబ్బంది రంగంలోకి దిగింది. దాదాపు 30 గంటల పాటు శ్రమించి వారిని కాపాడారు. ఐఎన్‌ఎస్‌ ఖంజర్‌ సాయంతో మత్స్యకారుల పడవలను ఒడ్డుకు లాక్కొచ్చారు. తమిళనాడులోని నాగపట్టణం తీరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

నాగపట్టణం  నుంచి 36 మంది మత్స్యకారులు మూడు పడవల్లో ఇటీవల చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. సముద్రంలో వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో పాటు ఇంధనం లేకపోవడం, ఇంజిన్‌ సమస్య తలెత్తడంతో వీరి పడవలు నిలిచిపోయాయి. రెండు రోజుల పాటు వారు బంగాళాఖాతంలో చిక్కుకున్నారు. సమాచారం తెలుసుకున్న నౌకాదళం రంగంలోకి దిగింది. బంగాళాఖాతంలో విధుల్లో ఉన్న ఎన్‌ఐఎస్‌ ఖంజర్‌ను సహాయక చర్యలకు పంపింది. వీరు మత్స్యకారుల కోసం గాలింపు చేపట్టగా తమిళనాడు తీరానికి దాదాపు 130 నాటికల్‌ మైళ్ల దూరంలో మూడు పడవలు కన్పించాయి. ఆ మూడు బోట్లకు తాళ్లు కట్టి 30 గంటలకు పైగా లాక్కుంటూ చెన్నై హార్బర్‌కు తీసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news