రాహుల్ కు మరో శుభవార్త..లోకసభ సభ్యత్వం పునరుద్దరణ…!

-

రాహుల్ గాంధీ రాహుల్ కు మరో శుభవార్త..లోకసభ సభ్యత్వం పునరుద్దరణ కానున్నట్లు సమాచారం అందుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిపేరు వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఇవాళ భారీ ఊరట లభించింది. సూరత్ కోర్టు తీర్పు పై తాజాగా స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

గరిష్ట శిక్ష విధింపులు ట్రైల్ కోర్టు సరైన కారణం చూపించలేదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయం తెలిపింది. ఇది ఇలా ఉండగా, ఏ క్షణంలోనైనా రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోకసభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

అధికారికంగా సుప్రీంకోర్టు “స్టే” ఉత్తర్వులు అందగానే నోటిఫికేషన్ జారీ చేయనుంది లోకసభ సెక్రటేరియట్. సుప్రీం కోర్టు స్టే ఉత్తర్వులు తో సోమవారం నుంచి సభా కార్యక్రమాలకు హాజరుకానున్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్, ప్రతిపక్షాల కూటమి “ఇండియా” ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం పై వచ్చే మంగళవారం నుంచి గురువారం జరిగే చర్చలో పాల్గొననున్నారు రాహుల్ గాంధీ.

Read more RELATED
Recommended to you

Latest news