ఇంగ్లాండ్ వేదికగా హండ్రెడ్ టోర్నమెంట్ జరుగుతున్న విషయం తెలిసిందే. గత రాత్రి సదరన్ బ్రేవ్ మరియు వెల్ష్ ఫైర్ జట్ల మధ్యన జరిగిన మ్యాచ్ లో ఆఖరి బంతి వరకూ నువ్వా నేనా అన్నట్లు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. కానీ చివరికి విజయం సదరన్ బ్రేవ్ ను వరించింది.. మొదట బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ లో బ్యాట్స్మన్ అందరూ చేతులు ఎత్తేయడంతో కనీసం 100 పరుగులు అయినా చేస్తుందా అనుకున్నాము.. కేవలం 76 పరుగులకే ఎనిమిది వికెట్లు పడిపోయాయి. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఆల్ రౌండర్ జోర్డాన్ అద్భుతమైన హిట్టింగ్ తో జట్టుకు గెలవగలిగే స్కోర్ 147 ను అందించాడు. ఇతని ఇన్నింగ్స్ లో కేవలం 32 బంతుల్లో 3 ఫోర్లు మరియు 7 సిక్సులతో 70 పరుగులు చేశాడు. హరీష్ రాఫ్ కట్టుదిట్టముగా బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు దక్కించుకున్నాడు. లక్ష్యఛేదనలో వెల్ష్ ఫైర్ చివరి బంతి వరకూ పోరాడి ఓటమి పాలయింది. ఆఖరి 5 బంతులకు 11 పరుగులు అవసరం అయిన దశలో మిల్స్ బౌలింగ్ లో విల్లీ వరుసగా నాలుగు డబుల్స్ చేశాడు..
ఇక ఆఖరి బంతికి మూడు పరుగులు కావాల్సి ఉంది. భారీ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ గా అవుట్ అయ్యాడు. దీనితో సదరన్ బ్రేవ్ రెండు పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది.