ఇక్కడ జరిగిన మంచి ఏపీలోని అధికార, ప్రతిపక్ష నేతలకు కనిపించింది.. కానీ : మంత్రి కేటీఆర్‌

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడికి తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి ప‌క్క రాష్ట్రంలోని చంద్ర‌బాబు, జ‌గ‌న్‌కు అర్థ‌మైంది. కానీ రాష్ట్రంలోని విప‌క్షాల‌కు అర్థం కావ‌డం లేద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. తాము మోదీకే భయపడమని, అలాంటిది ఇక్కడి వారికి భయపడతామా? అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. శనివారం అసెంబ్లీలో పల్లె, పట్టణ ప్రగతిపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ… ప్రతిపక్షాలకు కూలగొట్టడం మాత్రమే తెలుసునని, తమకు మాత్రం కట్టడం తెలుసునన్నారు. మల్లు భట్టి ఇటీవల పాదయాత్ర చేశారని, ఆయనకు అభివృద్ధి కనిపించలేదా? అని ప్రశ్నించారు.

Assembly: ఎక్కడా అభివృద్ధి పనులు ఆగలేదు: కేటీఆర్ | Minister KTR Speech In  Assembly

ఆయన ప్రతిపక్షంలో వందేళ్లు ఉండాలని కోరుకుంటున్నానని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పది కాలాల పాటు నిలిచే పథకాలకు రూపకల్పన చేశారన్నారు. మల్లు భట్టికి తన పాదయాత్రలో ఇదేమీ కనిపించలేదా? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో పదిమంది ముఖ్యమంత్రులని ప్రచారం సాగుతోందని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కాంగ్రెస్‌కు కనిపించడం లేదన్నారు. తాము చేసిన అభివృద్ధి సీతక్క, రఘునందనరావు, భట్టికి తెలియదా? అన్నారు. దుబ్బాకలోని ముస్తాబాద్‌లోకి యూపీ, బీహార్, బెంగాల్ నుండి కూలీలు వస్తారని మీకు తెలుసు కదా అన్నారు.

 

మనం రివర్స్ మైగ్రేషన్ చూస్తామని అనుకున్నామా? ఇదంతా సంపద సృష్టివల్ల జరిగిందన్నారు. అభివృద్ధి ఏమాత్రం జరగలేదంటే ఎలా? అన్నారు. గతంలో బతుకమ్మను విడిచేందుకు నీళ్లు కూడా లేకపోయేవని, నీళ్ల కోసం అనుభవించిన బాధ మహిళలకు, బతుకమ్మకూ తెలుసన్నారు. తెలంగాణలో ఏ గ్రామాన్ని ఫోటో తీసినా వైకుంఠధామం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పచ్చని చెట్లు కనిపిస్తాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news