ఏపీ రాజకీయం వర్సెస్ సినిమాగా మారింది. ఇటీవల పవర్‌స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమా నుంచి ప్రారంభమైంది ఈ వివాదం. అయితే.. తాజాగా భోళా శంకర్ సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో మెగస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి ఆజ్యం పోసినట్లైంది. దీంతో వైసీపీ నేతలు భగ్గమంటూ మెగాబ్రదర్స్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. పవన్ కల్యాణ్ మాజీ భార్య స్పందిస్తూ.. ఫ్యామిలీని ఈ రచ్చలోకి లాగోద్దంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే.. రేణు దేశాయ్ కి మంత్రి అంబటి కౌంటర్ ఇచ్చారు.. అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని !’ అంటూ అంబటి బదులిచ్చారు. అయితే..
అయితే.. ఇటీవల బ్రో చిత్రంలో ఒక పాత్ర ద్వారా ఏపీ మంత్రిని విమర్శించారంటూ పవన్ కల్యాణ్ పైనా, చిత్రబృందంపైనా దుమారం రేగడం తెలిసిందే. ఈ పరిణామాలపై రేణూ దేశాయ్ స్పందించారు. గత కొన్నిరోజులుగా తాను విదేశాల్లో ఉన్నానని, తిరిగొచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెలిశాయని వెల్లడించారు. పవన్ మూడు పెళ్లిళ్లు, నలుగురు పిల్లలపై ఓ చిత్రం తీస్తున్నారన్న వార్తలు కూడా వినిపించాయని తెలిపారు. ఇలాంటివి తనను చాలా బాధిస్తున్నాయని అన్నారు.
“మా పిల్లలు సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టారు. నా బిడ్డల తండ్రి నటుడు, రాజకీయ నాయకుడు. అభిమానులు, నేతలు, విమర్శకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా… నా పిల్లలనే కాదు, ఏ పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగకండి. వ్యక్తిగత అజెండాలు ఉంటే మీరు మీరు చూసుకోండి. పిల్లలకు రాజకీయాలతో ఏంటి సంబంధం? వాళ్లు పవన్ కల్యాణ్ పిల్లలు అయినందునే వారిని ఇలా ఇబ్బందులకు గురిచేస్తారా? ఇటీవలి పరిణామాలతో వాళ్లకు ఏమైనా సంబంధం ఉందా?” అంటూ రేణూ దేశాయ్ స్పందించారు. అయితే.. రేణూ దేశాయ్ వ్యాఖ్యలకు పైవిధంగా అంబటి స్పందించారు.