సీఎం కేసీఆర్ రాష్ర్టంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం దావుద్గూడలో మంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కందుకూరు మండలంలోని పులిమామిడి గ్రామానికి చెందిన బీజేపీ ఎంపీటీసీ రాజమ్మతో పాటు వంద మంది బీజేపీ,కాంగ్రెస్ పార్టీల కు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు. వారిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సాదారంగా పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువాలను కప్పారు.
రైతు బంధు, రైతు బీమా, బీసీ బంధు, గృహలక్ష్మి వంటి పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని వివరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి.మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు ఎంపీటీసీ తాండ్ర ఇందిరమ్మ దేవేందర్ పాల్గొన్నారు.