వాలంటీర్ వ్యవస్థపై పవన్‌ మరోసారి వ్యాఖ్యలు

-

లిక్కర్ అమ్మకాల ద్వారా సీఎం జగన్ 30 వేల కోట్లు సంపాదించారని జనసేన అధినేత ఆరోపించారు. గురువారం వైజాగ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మరోసారి వాలంటీర్‌ వ్యవస్థపై వ్యాఖ్యలు చేశారు. ప్రజల డేటా దుర్వినియోగానికి ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కారణమవుతోందంటూ పోరాటం ప్రారంభించిన పవన్ కల్యాణ్ ఎన్ని విమర్శలు వచ్చినా ఎక్కడా తగ్గేదేలేదంటున్నారు. వాలంటీర్లకు ఓటీపీతో పనేంటి? అని ప్రశ్నించారు. ఓటీపీ అడిగి మొన్న రాజమండ్రిలో డబ్బు దోచుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కొయ్యలగూడెంలో ఒక వాలంటీర్ మహిళ వేలిముద్రతో బ్యాంక్ నుంచి రూ.1.70 లక్షలు దోచేశాడని వివరించారు. పెందుర్తిలో ఒక వాలంటీర్ వృద్ధురాలిని చంపి నగలు దోచేశారని తెలిపారు. వాలంటీర్లు డేటా సేకరించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు.

వాలంటీర్లతోపాటు వైఎస్సార్ పై కూడా సంచలన వ్యాఖ్యలు | pawan kalyan speech at  vizag varahi tour

జగన్ వాలంటీర్లతో, ప్రభుత్వ ఉద్యోగులతో తప్పులు చేయిస్తున్నాడని పవన్ కల్యాణ్ విమర్శించారు. గతంలోనూ అన్న, అక్క అంటూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో తప్పులు చేయించి, వారు జైలుకు వెళ్లడానికి కారకుడయ్యాడని ఆరోపించారు. “నేను వాలంటీర్ వ్యవస్థలోని లోపాల గురించి మాట్లాడాను. సింహాద్రి అప్పన్న సాక్షిగా చెబుతున్నా… వాలంటీర్ల పొట్టకొట్టాలన్నది నా ఉద్దేశం కాదు. అవసరమైతే ఇంకో రూ.5 వేలు ఎక్కువగా ఇచ్చే వ్యక్తిని నేను. కానీ మీతో జగన్ తప్పు చేయిస్తున్న విషయాన్ని గుర్తించండి. ప్రజల నుంచి సేకరించిన ఆధార్, బ్యాంక్, ఇతర వివరాలను నానక్ రామ్ గూడలోని ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీకి అప్పగిస్తున్నారు” అని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news