పవన్‌కు నోటీసులిచ్చిన విశాఖ పోలీసులు

-

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా నిన్న జరిగిన సభలో పవన్‌ కల్యాణ్‌ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ అభియోగాలు దాఖలు చేశారు. ఈ మేరకు విశాఖ తూర్పు ఏసీపీ మూర్తి… జనసేనానికి నోటీసులు జారీ చేశారు. నిన్నటి బహిరంగ సభలో పవన్ నిబంధనలు ఉల్లంఘించారని, ఆయన అలా వ్యవహరించి ఉండకూడదని, బహిరంగ సభల్లో బాధ్యతగా మాట్లాడాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. విద్వేష వ్యాఖ్యలు చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఈ సభలో వాలంటీర్లు, ఆంధ్రా యూనివర్సిటీపై ఆరోపణలు చేసిన జనసేనానికి సెక్షన్ 30 కింద నోటీసులు జారీ అయ్యాయి.

Pawan Kalyan unwell

ఇదిలా ఉంటే.. విశాఖలోని రుషికొండలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. నగరంలోని జోడుగుళ్లపాలెం నుంచి ఎవరినీ అనుమతింబోమని పోలీసులు తేల్చి చెప్పారు. ర్యాడిసన్‌ బ్లూ హోటల్‌ నుంచి కేవలం పవన్‌ వాహనానికి మాత్రమే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు. రుషికొండ ఎదురుగా ఉన్న రోడ్డులో మాత్రమే పవన్‌ వెళ్లాలన్నారు. కావాలంటే పవన్‌ కల్యాణ్‌ గీతం యూనివర్సిటీ వద్ద మీడియాతో మాట్లాడవచ్చని పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news