డ్వాక్రా మహిళా సంఘాల ఏర్పాటు ఘనత ఎన్టీఆర్‌దే : మంత్రి ఎర్రబెల్లి

-

కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ, ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మంత్రి ఎర్రబెల్లి సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర మహిళల్లో ఆర్థిక చైతన్యం పెరిగి, సామాజికంగా గౌరవం దక్కేలా పారిశ్రామికవేత్తలుగా ఎదగాల్సిన అవసరం ఉందని అన్నారు.

CM KCR striving for welfare of Muslims: Errabelli Dayakar Rao

డ్వాక్రా మహిళా సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత అప్పటి సీఎం నందమూరి తారకరావుకు దక్కితే.. వాటిని బలోపేతం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు అన్ని అవకాశాలు కల్పించామని ఆయన వెల్లడించారు. కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. వంద కోట్లతో కొడకండ్లలో టెక్ట్స్‌టైల్‌ పార్క్‌ ను ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి.

తెలంగాణకు చెందిన డ్వాక్రా సంఘాల మహిళలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి మహిళలను చైతన్య పరిచి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేస్తుండడం అభినందనీయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 35 ఏళ్లుగా నాపై నమ్మకంతో గెలిపిస్తున్న ప్రజలకు ఎప్పటికి రుణపడి ఉంటానని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నాడు. తెలంగాణ రాష్ట్రాభివృద్దిని చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో, సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా జరగడం లేదని మంత్రి ఎద్దేవా చేశాడు. వరంగల్ లో రూ.1100 కోట్లతో నిర్మిస్తున్న సూపర్ స్పెషల్ ఆసుపత్రిలో మహిళల కోసం ప్రత్యేక వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news